భూమి, సాగు చట్టాలపై లీఫ్స్ సంస్థ ఉచిత శిక్షణ

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ప్రతి రైతుకు చట్టాల గురించి తెలియాలి. వ్యవసాయం చేసేటోళ్లకు చట్టం గురించి ఎందుకు అనుకునే రోజులు పోయాయి. 1990 నుంచి వ్యవసాయ రంగంలోనే లెక్కకు మించిన చట్టాలు వచ్చాయి. రైతులకు చట్టం చుట్టం కావాలి. అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వినూత్న ఆలోచనతో ముందుకొస్తున్నాం. రైతుల సహకారం అవసరం. భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. పంట రుణాలు, ఎరువులు, భూమి హక్కులు, రసాయనాల వినియోగం, నకిలీ విత్తనాలు కొని నష్టపోతే […]

Update: 2021-10-26 07:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ప్రతి రైతుకు చట్టాల గురించి తెలియాలి. వ్యవసాయం చేసేటోళ్లకు చట్టం గురించి ఎందుకు అనుకునే రోజులు పోయాయి. 1990 నుంచి వ్యవసాయ రంగంలోనే లెక్కకు మించిన చట్టాలు వచ్చాయి. రైతులకు చట్టం చుట్టం కావాలి. అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వినూత్న ఆలోచనతో ముందుకొస్తున్నాం. రైతుల సహకారం అవసరం. భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. పంట రుణాలు, ఎరువులు, భూమి హక్కులు, రసాయనాల వినియోగం, నకిలీ విత్తనాలు కొని నష్టపోతే నష్టపరిహారం పొందడానికి చట్టాలు ఉన్నాయి. ఇవి తెలియకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని లీగల్​ఎంపవర్మెంట్​అండ్​అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు ఎం.సునీల్​కుమార్​(భూమి సునీల్) అన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే 250 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు రైతుకు రోజూ అవసరం పడేది. విత్తనాలు కొన్నాం. నష్టపోయాం. అప్పుడు నష్టపరిహారం పొందడం ఎట్లా? నా భూమిలో చెట్టుకు కొట్టుకోవాలి. దానికెట్లా? భూమికి చిక్కులు ఉన్నాయి. ఏం చేయాలి? మార్కెటింగ్​చేసుకోవాలి. అప్పుడేం చేయాలి. ఇలాంటి అన్ని అంశాల్లో చట్టాలు ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతుకు లాభం కలుగుతుంది. అందుకే ఇలాంటి చట్టాలపై ప్రతి రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయం, మార్కెటింగ్​, రుణ సదుపాయం, నష్టపరిహారం పొందడం వంటి అనేకాంశాలపై రైతులు తెలుసుకోవడం ప్రస్తుత తరుణంలో అనివార్యంగా మారింది. రైతుకు చట్టం చుట్టం కావాలి. ప్రతి రైతు ఒక్కసారైన భూ హక్కుల పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్షలతో పాటు ఇది కూడా తప్పనిసరైంది. అలాగే సాగు న్యాయంలో సభ్యుడిగా చేరితే ఉచిత న్యాయ సలహాలు అందిస్తామన్నారు. అందుకే లీఫ్స్ సంస్థ తరఫున భూమి, వ్యవసాయ చట్టాల నిపుణులను తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గ్రామానికి కనీసం ఒక్కరైనా ఉండాలి. శిక్షణ ఇచ్చి వలంటీరుగా తయారు చేయాలని నిర్దేశించాం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల్లో ప్రతి గ్రామం నుంచి ఉచిత శిక్షణ పొందొచ్చునన్నారు. ‘సాగు న్యాయ నేస్తాం’ పేరుతో సుశిక్షితులుగా తయారు చేసేందుకు లీఫ్స్ సంస్థ కృషి చేస్తోంది. ఎవరైనా సాగు న్యాయ నేస్తంగా చేరాలనుకుంటే సమాచారం ఇవ్వండి. ఏ గ్రామంలో పని చేయదల్చుకున్నారో ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి. వారు రైతు అయి ఉండాలి. నలుగురికి సాయపడాలన్న ఆలోచన ఉండాలి. తామిచ్చిన సమాచారాన్ని నలుగురికి పంచే గుణం ఉండాలి. అలాంటి వారికి లీఫ్స్ సంస్థ అన్ని విధాల శిక్షణ అందిస్తోంది. ఆ తర్వాత సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుందని ఎం.సునీల్​కుమార్​వివరించారు.

మీ ఊరికి మీరే సాగు న్యాయ నేస్తం కావొచ్చునన్నారు. పది మంది రైతులకు మీరే తోడుగా నిలవొచ్చునన్నారు. లీఫ్స్ సంస్థలో సాగు న్యాయ నేస్తంగా చేరి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సాగు న్యాయ నేస్తంగా పని చేయాలంటే పేరు, ఊరు పేరు, గ్రామ పంచాయతీ, రెవెన్యూ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం వివరాలను 6305275697 అనే నంబరుకు వాట్సాప్ చేయండి. లేదా snnleafs@gmail.com కు ఈ మెయిల్ చేయవచ్చు అన్నారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధి ఫోన్​చేసి మిగతా వివరాలు తెలుసుకుంటారన్నారు. ప్రతి గ్రామం నుంచి ఎంత మందికైనా ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. శిక్షణ పొందిన వారు విధిగా తోటి రైతులకు అవగాహన కల్పించాలని షరతు విధించారు.

Tags:    

Similar News