‘మేయర్‌కు చేసినట్టుగానే అందరికీ పరీక్షలు చేయాలి’
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ నిబంధనలు ప్రజలకు ఒక రకంగా, పాలకులకు ఒక రకంగా ఉంటాయా? అని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన చేశారు. కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు నిర్వహించడం సాధ్యం కాదని స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. ‘నగర మేయర్ డ్రైవర్‌కి కరోనా వైరస్ వచ్చిందని, […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ నిబంధనలు ప్రజలకు ఒక రకంగా, పాలకులకు ఒక రకంగా ఉంటాయా? అని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన చేశారు. కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు నిర్వహించడం సాధ్యం కాదని స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. ‘నగర మేయర్ డ్రైవర్‌కి కరోనా వైరస్ వచ్చిందని, మేయర్‌కు పరీక్షలు చేయాలని ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని, ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు సామాన్య ప్రజలకు వర్తిస్తాయి, కానీ పాలకులకు వర్తించావ’ అని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మేయర్‌కు చేసినట్టుగానే, పాజిటివ్ వచ్చిన పత్రి వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.