ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పించాలి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ర్టంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గ్రామాల్లోకి మమహ్మారి చేరడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. కాగా తాజాగా గవర్నర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదారెడ్డి స్పందించారు. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్… రాష్ట్రంలో కోవిడ్19 ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ర్టంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గ్రామాల్లోకి మమహ్మారి చేరడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. కాగా తాజాగా గవర్నర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదారెడ్డి స్పందించారు. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్…
రాష్ట్రంలో కోవిడ్19 ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ… సీఎం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. భజనపరుల ద్వారా ఎదురుదాడి చేయడం ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది.. అదే, విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారన్న లక్ష్మణ్ గుర్తుచేశారు. ఇకనైనా సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై స్పందించి ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.