నేను క్షమాపణ చెప్పను: ప్రశాంత్ భూషణ్

దిశ, వెబ్‌డెస్క్: సీజేఐని, సుప్రీంకోర్టును కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై క్షమాపణ చెప్పేందుకు సుప్రీంకోర్టు ప్రశాంత్‌కు మూడు రోజుల గడువు ఇచ్చింది. అయితే, ఆ గడువు నేటితో ముగియనుంది. దీనిపై స్పందించిన ప్రశాంత్ భూషన్.. సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. తాను క్షమాపణ చెబితే కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లే అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల క్షమాపణ చెబితే శిక్ష విధింపు పై […]

Update: 2020-08-24 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీజేఐని, సుప్రీంకోర్టును కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై క్షమాపణ చెప్పేందుకు సుప్రీంకోర్టు ప్రశాంత్‌కు మూడు రోజుల గడువు ఇచ్చింది.

అయితే, ఆ గడువు నేటితో ముగియనుంది. దీనిపై స్పందించిన ప్రశాంత్ భూషన్.. సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. తాను క్షమాపణ చెబితే కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లే అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల క్షమాపణ చెబితే శిక్ష విధింపు పై ఆలోచిస్తామని కోర్టు సూచించినప్పటికీ.. ఏ శిక్ష విధించిన సంతోషంగా స్వీకరిస్తానని ప్రశాంత్ భూషన్ తేల్చి చెప్పడం గమనార్హం.

Tags:    

Similar News