ఫస్ట్ ఎప్పటికీ స్పెషల్ : లావణ్య

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలో అందం, అభినయంతో ఇండస్ట్రీలో అందాల రాక్షసిగా పేరు తెచ్చుకున్న లావణ్య.. ‘నాకు ఈ చదువులు అవి వద్దు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న’ అంటూ మిథున క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది. సినిమాలో తన అల్లరితో నాగార్జున గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ క్యారెక్టర్‌ను గుర్తు చేయించిన లావణ్య కెరియర్.. మధ్యలో కొంచెం అటు ఇటుగా సాగినా ఇప్పుడు మాత్రం టాలీవుడ్, కోలీవుడ్‌లో […]

Update: 2020-08-10 05:24 GMT

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలో అందం, అభినయంతో ఇండస్ట్రీలో అందాల రాక్షసిగా పేరు తెచ్చుకున్న లావణ్య.. ‘నాకు ఈ చదువులు అవి వద్దు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న’ అంటూ మిథున క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది. సినిమాలో తన అల్లరితో నాగార్జున గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ క్యారెక్టర్‌ను గుర్తు చేయించిన లావణ్య కెరియర్.. మధ్యలో కొంచెం అటు ఇటుగా సాగినా ఇప్పుడు మాత్రం టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటూ కెరియర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతోంది. త్వరలో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న భామ.. టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది.

https://www.instagram.com/p/CDtAQgNHPOw/?igshid=1oavmc7esocnp

తన ఫస్ట్ మూవీ ‘అందాల రాక్షసి’ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేర్ పిక్ షేర్ చేసిన లావణ్య.. ప్రతీ ఒక్క యాక్టర్‌కు తొలి సినిమా చాలా ప్రత్యేకమని చెప్తోంది. ఈ సినిమా ద్వారానే మనం ఏంటో ఇండస్ట్రీకి తెలిస్తే.. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో మనకి పరిచయం అవుతుందని తెలిపింది. అందాల రాక్షసి మూవీ టీమ్ తనకు బెస్ట్ ఇచ్చిందని.. అన్ని సౌకర్యాలు సమకూర్చి నన్ను పాడు చేసిందని తెలిపింది. అందరికీ ధన్యవాదాలు తెలిపిన లావణ్య.. సూపర్ టాలెంట్‌తో నిండిన నటీనటులు, సాంకేతిక నిపుణులున్న అందాల రాక్షసి టీమ్‌లోని అందరూ కూడా పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

Tags:    

Similar News