నవ్వుతున్న పాము.. మురళీగానం చేస్తున్న ఉడుత

దిశ, ఫీచర్స్ : బుసలు కొట్టే పాములు తెలుసు.. కానీ స్మైల్ ఇచ్చే స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా? పిల్లనగ్రోవితో మురిపించే చిన్ని కృష్ణుడికి మించి రాగాలు పలికిస్తుందో ఉడుత. ఎవరు ఎంత పైకి ఎగురుతారంటూ మనుషులేనా పోటీ పెట్టుకునేది.. మాకేం తక్కువా అంటూ చేప పిల్లలు గెంతుతున్నాయి. ర్యాంప్ వాక్ చేసే మోడల్స్‌కే హొయలు నేర్పుతున్న పెంగ్విన్స్. ఏంటీ ఇవన్నీ అనుకుంటున్నారా? హాస్యం ద్వారా వన్యప్రాణి సంరక్షణను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ పాల్ జాయిన్సన్, హిక్స్ […]

Update: 2021-09-07 10:54 GMT

దిశ, ఫీచర్స్ : బుసలు కొట్టే పాములు తెలుసు.. కానీ స్మైల్ ఇచ్చే స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా? పిల్లనగ్రోవితో మురిపించే చిన్ని కృష్ణుడికి మించి రాగాలు పలికిస్తుందో ఉడుత. ఎవరు ఎంత పైకి ఎగురుతారంటూ మనుషులేనా పోటీ పెట్టుకునేది.. మాకేం తక్కువా అంటూ చేప పిల్లలు గెంతుతున్నాయి. ర్యాంప్ వాక్ చేసే మోడల్స్‌కే హొయలు నేర్పుతున్న పెంగ్విన్స్. ఏంటీ ఇవన్నీ అనుకుంటున్నారా?

హాస్యం ద్వారా వన్యప్రాణి సంరక్షణను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ పాల్ జాయిన్సన్, హిక్స్ ఎంబీఈ, టామ్ సుల్లమ్‌లు 2015లో ‘కామెడీ వైల్డ్‌లైఫ్ ఫోటో’ అవార్డులను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ పోటీలకు ఫొటోలను పంపే అవకాశముండగా, 2021కి 7వేలకు పైగా ఫోటో ఎంట్రీలను వచ్చాయి. అందులోంచి 42 చిత్రాలను షార్ట్‌లిస్ట్ చేశారు. అంతేకాదు ప్రజలు తమకు ఇష్టమైన ఫన్నీ ఫోటోను ఎంచుకోవడానికి పీపుల్స్ చాయిస్ అవార్డు ఉండగా, దాని ఓటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది.

భారతదేశం నుంచి నవ్వుతున్న వైన్ పాము ఉండగా.. దీన్ని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆదిత్య కశిర్ సాగర్ షూట్ చేశాడు. ఫాల్క్‌లాండ్ దీవుల బీచ్‌లలో గెంటూ పెంగ్విన్స్ చిత్రం, ఆలింగనం చేసుకుంటున్న ఆస్ట్రేలియా కంగారూ చిత్రాలు ఈ షార్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రతి ఏటా ఓ జీవిని సంరక్షించేందుకు ఈ పోటీ మద్దతు ఇస్తుండగా, ఈ సంవత్సరం ‘సేవ్ వైల్డ్ ఒరంగుటాన్స్‌’‌కు సపోర్ట్‌గా నిలిచింది. ఇక పోటీల వల్ల వచ్చిన మొత్తం నికర ఆదాయంలో 10% స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందిస్తోంది.

Tags:    

Similar News