RBI: ఆర్బీఐ బంపర్ ఆఫర్.. 25 ఏళ్ల వయసుంటే రూ.10 లక్షలు మీవే..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.10 లక్షలు గెలుచుకునే సూపర్ అవకాశం కల్పించింది.

Update: 2024-09-08 17:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరు ఎలాంటి ఖర్చు చేయకుండానే ఏకంగా రూ.10 లక్షలు గెలుచుకునే సూపర్ అవకాశం కల్పించింది. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓ చిన్న పని చేస్తే సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే.. ఆర్బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 25 ఏళ్ల లోపు యువతకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

దేశ ఆర్థిక వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ గురించిన అవగహాన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మొత్తం 4 స్టేజ్‌లు ఉంటాయి. మొదట ఆన్‌లైన్ విధానం (Online Test)లో పోటీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అందులో టాప్‌లో వచ్చిన వారికి రాష్ట్ర స్థాయి (State level)లో పోటీలు పెడతారు. ఆ తర్వాత జోనల్ స్థాయి (Zonal Level)లో పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఫైనల్ ఉంటుంది. నేషనల్ లెవల్‌లో గెలిచిన మొదటి ముగ్గురికి రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు ప్రైమ్ మనీ అందస్తారు. అలాగే జోనల్ స్థాయిలో గెలిచిన ముగ్గురికి రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో 3 స్థానాలకు రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్ష నగదు బహుమతి ఉంటుంది.

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్విజ్ పోటీలు జరగనున్న ఈ పరీక్షలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి. ఈ క్విజ్ పోటీ (Quiz test)ల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైపోయాయి. ఒకవేళ మీరు కూడా 2024, సెప్టెంబర్1వ తేదీ నాటికి 25 ఏళ్ల లోపు వయసువారై ఉండి.. ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులై ఉండి.. మీక్కూడా రూ.10 లక్షలు గెలుచుకోవాలని ఆసక్తి ఉంటే సెప్టెంబర్ 17, 2024 రాత్రి 9 గంటలలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం https://www.rbi90quiz.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. దీనికోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


Similar News