మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఒక్కరోజే 40 మంది కాల్చివేత
తిరుగుబాటు దారులపై మణిపూర్ ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. ఒక్కరోజే 40 మందిని బలగాలు కాల్చి చంపాయి.
దిశ,వెబ్‌డెస్క్: తిరుగుబాటు దారులపై మణిపూర్ ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. ఒక్కరోజే 40 మందిని బలగాలు కాల్చి చంపాయి. మరో పది మందికిపైగా బుల్టెట్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సేక్‌మయి, సుంగు, ఫయేంగ్, సెరయు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. తిరుగుబాటుదారులకు, బద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఆ ప్రదేశం అంతా మృతదేహాలు చల్లా చెదురుగా పడిపోయాయి.ఈ ఘటనతో సీఎం బీరేన్‌సింగ్ మాట్లాడుతూ తిరుగుబాటుదారులను ఉగ్రవాదులతో పోల్చారు. ఈ సంఘటనతో హుటాహుటిన కేంద్ర మంత్రి అమిత్‌షా మణిపూర్‌లో పర్యటించారు. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు అమిత్‌షా మణిపూర్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నారు. శాంతిని పాటించాలని మెయిటీ, కుకీతెగలకు అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. శాంతి యుత వాతావరణం నెలకొనేలా చర్యలు వేగవంతం చేశారు.
గత కొద్ది కొన్ని నెలలుగా ఎస్టీ హోదా కోసం మణిపూర్‌లోని తెగలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే..రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ప్రజలు మెయిటీ తెగకు చెందినవారే. బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ వలసదారులతోనే అసలు సమస్య ఏర్పడింది. హోంమంత్రి అమిత్ షా ఈరోజు మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని కొనసాగించాలని, సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఇప్పటికే కుకీలకు విజ్ఞప్తి చేశారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వెళ్లారు. షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీలో చేర్చాలన్న మీటీస్ డిమాండ్‌పై ఇంఫాల్ లోయ సహా చుట్టుపక్కల నివసించే మెయిటీలు, కొండల్లో స్థిరపడిన కుకీ తెగల మధ్య కొనసాగుతున్న జాతి హింసలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మే 3న ఘర్షణ మొదలైంది. మణిపూర్ రాష్ట్రంలో అప్పటి నుంచి ఇంటర్నెట్ సేవలు లేవు.