ముంబై స్ట్రీట్ సైడ్ కాఫీ స్టాల్‌పై నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మన దేశంలోని చిరు వ్యాపారులకు కొదువే లేదు. ఎందుకంటే వారు చేసే చిరు ప్రయత్నం, కస్టమర్ల పట్ల వారు చూపే ప్రేమ కొన్ని సందర్భాల్లో కోట్ల మంది హృదయాలను దొచుకుంటాయి.
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని చిరు వ్యాపారులకు కొదువే లేదు. ఎందుకంటే వారు చేసే చిరు ప్రయత్నం, కస్టమర్ల పట్ల వారు చూపే ప్రేమ కొన్ని సందర్భాల్లో కోట్ల మంది హృదయాలను దొచుకుంటాయి. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఒక యువ కాఫీ స్టాల్ యజమాని తన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు వినూత్న పంథాను అవలంభిస్తున్నాడు. మయాంక్ పాండే ముంబై లోని రోడ్డుపై 'ది కాఫీ బార్' పేరుతో ఓ స్టాల్ ను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను స్టాల్ పై 'నేను కాఫీ బార్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను' అనే పోస్టర్ ఉంచగా అది అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం స్టాల్ కు సంబంధిన ఓ ఫొటోను డి.ప్రశాంత్ నాయర్ ట్వీట్ చేయగా ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.