ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిచబోతున్నాము: డైరెక్టర్

తమిళ ప్రొడక్షన్ బ్యానర్ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తాజాగా ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది.

Update: 2024-10-08 15:08 GMT

దిశ, సినిమా: తమిళ ప్రొడక్షన్ బ్యానర్ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తాజాగా ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'అఘతియా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో రాశి ఖన్నాతో పాటు యూరోపియన్ నటి మటిల్డా & అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలను పోషించారు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్‌లు తాజాగా ‘అఘతియా’ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. లీడ్ యాక్టర్స్, వారి ఇంటెన్స్ ఫేస్‌లతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్ 'అఘతియా' మునుపెన్నడూ లేని సినిమా అనుభూతిని అందిస్తుందని సూచిస్తుంది.

ఫాంటసీ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కతున్న ఈ మూవీలో ప్రముఖ హాస్యనటులు యోగి బాబు, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్ & రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో దాదాపు 90 నిమిషాల పాటు అద్భుతమైన CG విజువల్స్‌ అలరించబోతున్నాయంటూ మేకర్స్ ఇస్తున్న అప్‌డేట్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు పా.విజయ్ మాట్లాడుతూ.. ''అఘతియా హ్యూమన్ ఎమోషన్స్‌తో ఫాంటసీని బ్లెండ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మ్యాజిక్ గురించి మాత్రమే కాదు, పాత్రల మధ్య బాండింగ్ గురించి, తెలియని ప్రపంచం గుండా వారి జర్నీని ఆవిష్కరించే అద్భుత చిత్రీకరణ. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోంది' అన్నారు.


Similar News