జానీ మాస్టర్‌కి షాక్.. ఉన్నట్లుండి తల్లికి హార్ట్ ఎటాక్
మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి భారీ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి భారీ షాక్ తగిలింది. అతడి తల్లి బీబీజాన్‌కు ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. కొడుకు జైలుకెళ్లడంతో బెంగపడి అనారోగ్యానికి గురైన బీబీజాన్.. శనివారం హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. దీంతో ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బీబీజాన్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందగానే జానీ మాస్టర్ భార్య అయేషా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గత ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టైన జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.