రోజుకూ అరగంట తగ్గించండి చాలు.. యాంగ్జైటీస్ దూరం అవుతాయి
ప్రజలు తమ స్వేచ్ఛను హరించినట్లు భావించడం, ప్రతిఘటించడం వంటి పరిస్థితులను తాము గమనించినట్లు తెలిపారు.
దిశ, ఫీచర్స్ : నిరంతరం సోషల్ మీడియాలో గడపడం వల్ల యువతలో మానసిక సంక్షోభానికి దారితీస్తోందని, స్వీయ పరిమితుల వల్ల ఈ పరిస్థితిని అధిగమించవచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. ఇందులో భాగంగా అయోవా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు యూత్‌లో మెంటల్ క్రైసిస్‌ను పరిష్కరించడంలో సహాయపడే సాధారణ మార్గాన్ని కనుగొన్నారు. మొత్తం 230 మంది కాలేజ్ స్టూడెంట్స్‌ను వారు రెండు వారాలపాటు సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు 30 నిమిషాలు మాత్రమే యూజ్ చేయాలని కోరారు. ఈ లిమిటెడ్ యూజర్లతోపాటు ఎటువంటి పరిమితి లేకుండా నిరంతరం సోషల్ మీడియాను యూజ్ చేసే మరో 230 మందిని కూడా పరిశోధకులు స్టడీ చేశారు. అయితే ఎటువంటి లిమిట్స్ లేకుండా యూజ్ చేసేవారితో పోల్చితే, రోజుకూ అరగంట మాత్రమే సోషల్ మీడియాయూజ్ చేసిన వారిలో యాక్టివ్ నెస్ పెరిగిందని, యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ బాగా తగ్గాయని గుర్తించారు.
సోషల్ మీడియా వినియోగం పై ఇతరులు పరిమితులు విధించడం కంటే ఎవరికి వారు స్వీయ పరిమితులు విధించుకోవడంవల్ల ఈ పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుందని ప్రధాన పరిశోధకుడు ఎల్లా ఫాల్‌హాబర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో సోషల్ మీడియాను యూజ్ చేయవద్దని ఒత్తిడి తెస్తే యువత, ప్రజలు తమ స్వేచ్ఛను హరించినట్లు భావించడం, ప్రతిఘటించడం వంటి పరిస్థితులను తాము గమనించినట్లు తెలిపారు. పైగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల కుటుంబం, స్నేహితులు, సమాజంతో కనెక్ట్ అవ్వడంతో కలిగే ప్రయోజనాలు కూడా మిస్ అవుతామనే భావన ప్రజల్లో ఉంటుందని పేర్కొన్నారు. అందుకే పరిమితులు ఇష్టపూర్వకంగా, స్వయంగా విధించుకోవడం వల్ల వ్యసనాలు, మానసిక సంక్షోభాలు తలెత్తకుండా ఉంటాయని, రోజుకూ అరగంట దూరంగా ఉండాలన్న లిమిట్ పెట్టుకున్నా ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు.
Read more: భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు