గ్రామంలో ఒకే గణేష్ విగ్రహం

దిశ, నిజామాబాద్ రూరల్: కరోనా నేపథ్యంలో గ్రామంలో ఓకే వినాయకుని గ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఇందల్వాయి మండలం నల్లవల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఉన్న యూత్ సంఘాలు, కుల సంఘాలు, పిల్లలు కొవిడ్-19 కారణంగా వినాయక విగ్రహాలు నెలకొల్పవద్దని వారు పేర్కొన్నారు. ఎక్కువమంది ఉన్నచోట కరోనా వ్యాప్తి చెందుతుందని, గ్రామంలో కేవలం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఓకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనిగ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసినట్లు వారు పేర్కొన్నారు. […]

Update: 2020-08-09 04:14 GMT

దిశ, నిజామాబాద్ రూరల్: కరోనా నేపథ్యంలో గ్రామంలో ఓకే వినాయకుని గ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఇందల్వాయి మండలం నల్లవల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఉన్న యూత్ సంఘాలు, కుల సంఘాలు, పిల్లలు కొవిడ్-19 కారణంగా వినాయక విగ్రహాలు నెలకొల్పవద్దని వారు పేర్కొన్నారు.

ఎక్కువమంది ఉన్నచోట కరోనా వ్యాప్తి చెందుతుందని, గ్రామంలో కేవలం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఓకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనిగ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసినట్లు వారు పేర్కొన్నారు. కరోనా కట్టడికి గ్రామస్తులంతా ఏకతాటిపై నిలబడి మాస్కూలు, భౌతిక దూరాన్ని పాటించి గ్రామ కట్టుబాట్లకు లోనే ఉండాలని అని ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు ఉన్నారు.

Tags:    

Similar News