'చాప కింద నీరులా గుండాలలో కరోనా'

దిశ, ఆలేరు: యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు చేయాలంటూ సూపర్ వైజర్ కు మంగళవారం ఎన్ఎస్ యూఐ కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి గూడ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వ్యాధి చాప కింద నీరులగా గుండాల మండలంలో విజృంభిస్తున్నది, ఈ నేపథ్యంలో మండలంలో అధికంగా కరోనా టెస్టులు చెయాలని డిమాండ్ చేశారు. హోం క్వారెంటైన్ లో […]

Update: 2020-07-28 04:31 GMT

దిశ, ఆలేరు: యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు చేయాలంటూ సూపర్ వైజర్ కు మంగళవారం ఎన్ఎస్ యూఐ కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి గూడ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వ్యాధి చాప కింద నీరులగా గుండాల మండలంలో విజృంభిస్తున్నది, ఈ నేపథ్యంలో మండలంలో అధికంగా కరోనా టెస్టులు చెయాలని డిమాండ్ చేశారు.

హోం క్వారెంటైన్ లో ఉన్న వాళ్లను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూఐ మండల నాయకులు ఆవుల సాయి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎలికట్టే ప్రశాంత్ గౌడ్, కొడపర్తి శేఖర్, సుధగాని యాదగిరి, ఎలికట్టే శేఖర్, రాజశేఖర్ రెడ్డి, యం డి ఫజల్, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News