'మేమందరం ఢిల్లీ వెళ్తాం'
దిశ, కంటోన్మెంట్ : మున్సిపాలిటీల తరహాలో కంటోన్మెంట్ బోర్డు అభివృద్దికి మ్యాచింగ్ గ్రాంట్ నిధులిప్పిస్తామని మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కంటోన్మెంట్ బోర్డు డిఫెన్స్ ఏస్టేట్స్ కార్యాలయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి,బోర్డు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని మట్లాడారు. తెలంగాణలోని మున్సిపాలిటీలలో అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏ విధంగానైతే నెల నెలా మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా నిధులను కేటాయిస్తున్నామో.. అదే విధంగా కంటోన్మెంట్ […]
దిశ, కంటోన్మెంట్ : మున్సిపాలిటీల తరహాలో కంటోన్మెంట్ బోర్డు అభివృద్దికి మ్యాచింగ్ గ్రాంట్ నిధులిప్పిస్తామని మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కంటోన్మెంట్ బోర్డు డిఫెన్స్ ఏస్టేట్స్ కార్యాలయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి,బోర్డు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని మట్లాడారు. తెలంగాణలోని మున్సిపాలిటీలలో అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏ విధంగానైతే నెల నెలా మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా నిధులను కేటాయిస్తున్నామో.. అదే విధంగా కంటోన్మెంట్ బోర్డుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై త్వరలోనే కేటీఆర్ ను కలుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.80 కోట్ల బకాయిలలో ప్రతి నెల రూ.10 కోట్ల చొప్పున చేల్లించేందు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంగీకరించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కంటోన్మెంట్ లో నీటి ఎద్దడిని నివారించినట్లు తెలిపారు. రామన్నకుంట, ప్యాట్నీ నాలాల అధునీకరణకు నిధులను కేటాయించామని, త్వరలోనే తిరుమలగిరి చెరువును సుందరీకరిస్తామని వెల్లడించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి కంటోన్మెంట్ రూ.500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందన్నారు. త్వరలోనే రాష్ట్ర ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బకాయిలు ఇప్పించేందుకు మంత్రి తలసాని, తాను, బోర్డు సభ్యులందరం కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు. కార్యక్రమంలో బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జె.రామకృష్ట, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండుయాదవ్, అనితప్రభాకర్, మాజీసభ్యులు ప్రభాకర్, శ్యాంకుమార్,సాదా నర్సింహ్మరెడ్డి తదతరులు పాల్గొన్నారు.