బెడ్‌పైనే మృతదేహం.. కలెక్టర్ ఆగ్రహం

అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో నిన్న ఉదయం 8 గంటలకు ఓ మహిళ మృతి చెందింది. అయితే ఆ మృతదేహాన్ని ఆస్పత్రి బెడ్ మీదే మృతదేహాన్ని ఇంచారు. కానీ, ఆ మృతదేహాన్ని ఎవరూ కూడా మార్చురీకి తరలించలేదు. విషయం తెలుసుకున్న ట్రైనీ కలెక్టర్ సూర్య ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం పరిస్థితిని పరిశీలించి.. మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై సీరియస్ అయ్యారు. అక్కడే ఉండి మృతదేహాన్ని […]

Update: 2020-07-27 00:45 GMT

అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో నిన్న ఉదయం 8 గంటలకు ఓ మహిళ మృతి చెందింది. అయితే ఆ మృతదేహాన్ని ఆస్పత్రి బెడ్ మీదే మృతదేహాన్ని ఇంచారు. కానీ, ఆ మృతదేహాన్ని ఎవరూ కూడా మార్చురీకి తరలించలేదు. విషయం తెలుసుకున్న ట్రైనీ కలెక్టర్ సూర్య ఆస్పత్రిని సందర్శించారు.

అనంతరం పరిస్థితిని పరిశీలించి.. మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై సీరియస్ అయ్యారు. అక్కడే ఉండి మృతదేహాన్ని మార్చురీకి తరలించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా వార్డు మొత్తానికి ఇద్దరు, ముగ్గురు సిబ్బందే విధుల్లో ఉన్నట్లు సమాచారం. సిబ్బంది కొరతపై ట్రైనీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని పెంచి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News