ప్రతిభను చాటుకునేందుకే ఈ కార్యక్రమం: జిల్లా కలెక్టర్
దిశ, సిద్దిపేట: ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకునేందుకు వేదికగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ఉపయోగపడుతుందని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా 15 ఆగష్టు, 2020 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఔత్సాహికులు తాము రూపొందించిన వినూత్న, కొత్త ఆవిష్కరణలను ప్రజలకు తెలియజేయడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి తెలిపారు. విద్యార్ధులు, గ్రామీణ, పట్టణ, సూక్ష్మ, […]
దిశ, సిద్దిపేట: ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకునేందుకు వేదికగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ఉపయోగపడుతుందని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా 15 ఆగష్టు, 2020 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఔత్సాహికులు తాము రూపొందించిన వినూత్న, కొత్త ఆవిష్కరణలను ప్రజలకు తెలియజేయడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి తెలిపారు. విద్యార్ధులు, గ్రామీణ, పట్టణ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగాల్లో కొత్తగా రూపొందించిన తమ ఆవిష్కరణలను పంపడానికి చివరి తేది జూలై 20 వరకు ఉందని, కొత్త ఆవిష్కరణలకు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రతిభను కనబరచుకోవాలన్నారు. తమ యొక్క ధరఖాస్తులను వాట్సాప్ నెం. 9100678543 కు పంపించాలని సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేటివ్ సెల్ కు 20-07-2020 లోగా అందిన దరఖాస్తులను పరిశీలించి వాటితో ప్రతి జిల్లా నుండి ఐదు ఆవిష్కరణలు ఎంపిక చేసి కోవిడ్-19 నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ, ఆవిష్కరణలకు, స్టార్టప్, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు, ఆవిష్కర్తలకు ఇదో మంచి అవకాశమని ఆయన అన్నారు.