నా చెప్పులు తీసుకురండి.. అప్పుడు చెప్తా : కంగన

దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు సోషల్ మీడియా వార్ కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలిచే భామ.. తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసేపై నోరు పారేసుకుంది. అసలు విషయానికొస్తే.. నటి యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యామీ హోమ్ టౌన్ హిమాచల్ ప్రదేశ్‌లో వివాహం జరగగా, ఈ జంట ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక మ్యారేజ్ […]

Update: 2021-06-07 03:02 GMT

దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు సోషల్ మీడియా వార్ కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలిచే భామ.. తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసేపై నోరు పారేసుకుంది. అసలు విషయానికొస్తే.. నటి యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యామీ హోమ్ టౌన్ హిమాచల్ ప్రదేశ్‌లో వివాహం జరగగా, ఈ జంట ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక మ్యారేజ్ వేడుకల్లో భాగంగా యామీ రెడ్ కలర్ చీర, ముక్కుకు పెద్ద ఉంగరంతో ఉన్న ట్రెడిషన్‌ లుక్‌ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంది.

కాగా బ్రైడల్ లుక్‌లో నిజంగా దేవతలానే కనిపిస్తోంది అంటూ కంగన యామీపై ప్రశంసలు కురిపించగా.. నటుడు విక్రాంత్ మాసే ‘గాడ్ ఉమన్ ‘రాధే మా’ వలె స్వచ్ఛమైన భక్తురాలు’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన.. ‘ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది, నా చెప్పులు తీసుకురండి దీని సంగతి చెప్తా’ అని రిప్లయ్ ఇచ్చింది. అయితే ‘రాధే మా’కు కంగనా మద్దతుదారా? అన్న విషయం తెలియదు కానీ.. హిందూ మతంపై విమర్శలు చేసేవారిపై తరచూ ఎదురుదాడి చేయడంతో పాటు మత పెద్దలకు మద్దతునిస్తుందన్న సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News