మైదానంలో కుప్పకూలిన లంక క్రికెటర్

ఆస్ట్రేలియా వేదికగా మరో నాలుగు రోజుల్లో మహిళా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య వార్మప్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో లంక పేసర్ అచిని కులసురియ తలకు బంతి బలంగా తాకడంతో కప్పకూలిపోంది. అప్పటికే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచినప్పటికీ, ప్రాక్టీస్ కోసం సూపర్ ఓవర్ ఆడించారు. ఈ నేపథ్యంలో దక్షణాఫ్రికా బ్యాట్స్ వుమన్ క్లో ట్రియన్ తొలి బంతిని భారీ షాట్ ఆడింది. లాంగ్ ఆఫ్‌లో […]

Update: 2020-02-17 02:35 GMT

ఆస్ట్రేలియా వేదికగా మరో నాలుగు రోజుల్లో మహిళా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య వార్మప్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో లంక పేసర్ అచిని కులసురియ తలకు బంతి బలంగా తాకడంతో కప్పకూలిపోంది. అప్పటికే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచినప్పటికీ, ప్రాక్టీస్ కోసం సూపర్ ఓవర్ ఆడించారు. ఈ నేపథ్యంలో దక్షణాఫ్రికా బ్యాట్స్ వుమన్ క్లో ట్రియన్ తొలి బంతిని భారీ షాట్ ఆడింది. లాంగ్ ఆఫ్‌లో ఉన్న కులసురియ బాల్‌ను క్యాచ్ పట్టుకోవడంలో అదుపు తప్పడంతో బాల్ నేరుగా ఆమె తలకి తాకింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. కులసురియని ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనతో సూపర్ ఓవర్‌ను రద్దు చేసి మ్యాచ్‌ను నిలిపివేశారు.

Tags:    

Similar News