లంక ప్రీమియర్ లీగ్ వాయిదా
దిశ, స్పోర్ట్స్: లంక ప్రీమియర్ లీగ్ 2021ని వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో జులై 30 నుంచి ప్రారంభ కావల్సిన లంక ప్రీమియర్ లీగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఐపీఎల్ జరిగే సమయంలోనే లంక ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించే అవకాశం ఉన్నది. శ్రీలంకకు చెందిన క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్‌లో ఆడట్లేదు కాబట్టి ఈ లీగ్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తున్నది. […]
దిశ, స్పోర్ట్స్: లంక ప్రీమియర్ లీగ్ 2021ని వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో జులై 30 నుంచి ప్రారంభ కావల్సిన లంక ప్రీమియర్ లీగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఐపీఎల్ జరిగే సమయంలోనే లంక ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించే అవకాశం ఉన్నది. శ్రీలంకకు చెందిన క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్‌లో ఆడట్లేదు కాబట్టి ఈ లీగ్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తున్నది.
అయితే లంక ప్రీమియర్ లీగ్‌తోపాటు ఐపీఎల్ ఆడుతున్న విదేశీ క్రికెటర్లు మాత్రం రెండింటిలో ఏ లీగ్ ఆడాలనేది తేల్చుకోవాల్సి ఉన్నది. ఐపీఎల్‌లో వచ్చే భారీ పారితోషికంతో పోల్చుకుంటే ఎల్‌పీఎల్‌లో తక్కువగానే వస్తుంది కాబట్టి విదేశీ క్రికెటర్లు యూఏఈలో ఐపీఎల్ ఆడటానికి మొగ్గు చూపించే అవకాశం ఉన్నది.