అందరినీ సంతోషపెట్టడమే నా కర్తవ్యం.. యంగ్ బ్యూటీ
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అవంతిక మిశ్రా తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల ‘భీష్మ’ సినిమాలో నితిన్ సరసన ఓ పాటలో మెరిసిన నటి ప్రస్తుతం ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. హరిహరన్ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఆర్. రవీంద్రన్ నిర్మించిన ‘ఎన్నా సొల్ల పోగి రాయ్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా విడుదలకుముందే.. ‘నెంజమెల్లాం కాదల్’, ‘డి బ్లాక్’ వంటి చిత్రాల్లోనూ చాన్స్ కొట్టేసింది భామ. […]
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అవంతిక మిశ్రా తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల ‘భీష్మ’ సినిమాలో నితిన్ సరసన ఓ పాటలో మెరిసిన నటి ప్రస్తుతం ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. హరిహరన్ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఆర్. రవీంద్రన్ నిర్మించిన ‘ఎన్నా సొల్ల పోగి రాయ్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా విడుదలకుముందే.. ‘నెంజమెల్లాం కాదల్’, ‘డి బ్లాక్’ వంటి చిత్రాల్లోనూ చాన్స్ కొట్టేసింది భామ. ఈ సందర్భంగా మాట్లాడిన బ్యూటీ.. ‘కళకు భాషలు, సరిహద్దులు లేవు. ఒక కళాకారిణిగా ప్రేక్షకులను సంతోషపెట్టడమే నా కర్తవ్యం. నాకు ఆసక్తికరమైన పాత్రలు రావడం సంతోషంగా ఉంది. ఛాలెంజింగ్ క్యారెక్టర్‌ల కోసం వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపింది. తెలుగు ప్రేక్షకుల ప్రేమను అందుకోవడం హ్యాపీగా ఉందన్న భామ.. కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.