అభివృద్ధి కోసం భూసేకరణ వేగవంతం..!
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం భూ సేకరణను ప్రభుత్వం మరింత వేగవంత చేస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనమండిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. ఫార్మాసిటీ కోసం 19 వేల ఎకరాలకు గాను ఇప్పటికి 8 వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. మిగిలిన భూముల సేకరణపై కొందరు రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇక పరిశ్రమల స్థాపన కోసం 14,561 ఎకరాల భూసేకరణ చేయగా.. భూములు […]
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం భూ సేకరణను ప్రభుత్వం మరింత వేగవంత చేస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనమండిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. ఫార్మాసిటీ కోసం 19 వేల ఎకరాలకు గాను ఇప్పటికి 8 వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. మిగిలిన భూముల సేకరణపై కొందరు రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇక పరిశ్రమల స్థాపన కోసం 14,561 ఎకరాల భూసేకరణ చేయగా.. భూములు అందించిన వారికి రూ. 863.86 కోట్లు అందించినట్లు వెల్లడించారు.