చింతూరులో బోటు ప్రమాదం..

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. వరద బాధితులకు సహాయక చర్యలు అందించి వస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ఏజెన్సీ ప్రాంతమైన శబరి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం.. కాకినాడకు చెందిన శ్రీగోదావరి బోటు(AP NK PB 0127) ఏజీ కొడేరు, కల్లేరుకు వెళ్లి వరద బాధితులకు సరుకులు అందించి తిరిగి వస్తుండగా చింతూరులోని శబరి వద్దకు రాగానే వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ కుదుపులకు […]

Update: 2020-08-20 08:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. వరద బాధితులకు సహాయక చర్యలు అందించి వస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ఏజెన్సీ ప్రాంతమైన శబరి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం.. కాకినాడకు చెందిన శ్రీగోదావరి బోటు(AP NK PB 0127) ఏజీ కొడేరు, కల్లేరుకు వెళ్లి వరద బాధితులకు సరుకులు అందించి తిరిగి వస్తుండగా చింతూరులోని శబరి వద్దకు రాగానే వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ కుదుపులకు గురైన బోటు
రెండు ముక్కలైనట్లు సమాచారం. ఆ సమయంలో బోటులో ఉన్నముగ్గురు గల్లంతయ్యారు. డౌన్ ఫ్లోలో శబరి వంతెన పిల్లర్‌ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు
సమాచారం.

సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. కాగా అదే బోటుతోపాటు వస్తున్న మరో బోటులోని సిబ్బంది గల్లంతైన ముగ్గురిలో ఇద్దరిని రక్షించారు. లాంచీ డ్రైవర్ పెంటయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే గోదావరి నదిలో వరద ప్రహహం ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో గతేడాది సెప్టెంబరు 15 న జరిగిన బోటు ప్రమాదం… రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదం నింపింది. ప్రమాద సమయంలో బోటులో 65 మంది ఉండగా వారిలో 26 మంది క్షేమంగా బయట పడ్డారు. మిగిలిన 39 మరణించడంతో వారి కుటుంబాల్లో తీరని దుఃఖం మిగిల్చింది ఈ పడవ ప్రమాదం. మరణించిన వారి మృతదేహాలు వెలికితీత చర్యలు దాదాపు 50 రోజులు పట్టడం గమనార్హం. ఏది ఏమైనా ఏపీలో ప్రతియేటా బోటు ప్రమాదాలు చోటు
చేసుకోవడం విషాదకరమే.

Tags:    

Similar News