కోకిల.. కర్ణాటిక్, హిందుస్థానీ నేర్చుకుందా? : లక్ష్మీ భూపాల్

దిశ, వెబ్‌డెస్క్ : దివికేగిన గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు.. ఎవరి దగ్గర నేర్చుకోనూ లేదు. అంతమాత్రాన ఆయన ఏ పాటను చెడగొట్టలేదు, ఆయనకు సంగీత పరిజ్ఞానం స్వతహాగా అబ్బింది. దీంతో పాడిన ప్రతీ పాటకు ప్రాణం పోశారే తప్ప.. ఏనాడు అన్యాయం చేయలేదు. అలాంటిది కొందరు పనికట్టుకుని బాలు మీద విమర్శలు చేస్తుండటం సహించలేని మాటల రచయిత లక్ష్మీ భూపాల్.. తనదైన శైలిలో విమర్శకులకు సమాధానం చెప్పారు. ‘ఎంత నోరు కట్టుకుని […]

Update: 2020-09-27 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
దివికేగిన గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు.. ఎవరి దగ్గర నేర్చుకోనూ లేదు. అంతమాత్రాన ఆయన ఏ పాటను చెడగొట్టలేదు, ఆయనకు సంగీత పరిజ్ఞానం స్వతహాగా అబ్బింది. దీంతో పాడిన ప్రతీ పాటకు ప్రాణం పోశారే తప్ప.. ఏనాడు అన్యాయం చేయలేదు. అలాంటిది కొందరు పనికట్టుకుని బాలు మీద విమర్శలు చేస్తుండటం సహించలేని మాటల రచయిత లక్ష్మీ భూపాల్.. తనదైన శైలిలో విమర్శకులకు సమాధానం చెప్పారు.

‘ఎంత నోరు కట్టుకుని కూర్చుందామంటే అంతలా పేట్రేగిపోతున్నారు.. నాదొక్కటే ప్రశ్న? సరోజిని నాయుడు, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, ఎస్ జానకి వంటి శాస్త్రీయ సంగీతం తెలిసిన ఉద్దండ గాయణీమణుల గానాన్ని గురించి గొప్పగా చెప్పాలంటే.. ‘కోకిల’తో పోల్చుతారు. మరి కోకిల ఏమైనా కర్ణాటిక్, హిందుస్థాని సంప్రదాయ సంగీతాన్ని అపోసన పట్టిన గాయకురాలా? చెవులకు ఇంపుగా ఉండేది ఏదైనా సంగీతమే.. అది మనసుకు హాయిగా ఉండేలా పాడేవాళ్ళు ఎవరైనా గాయకులే. ఒక వాహనానికి ఏదైనా ఇబ్బంది వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికంటే ఒక్కోసారి మెకానిక్‌ తొందరగా కనిపెట్టి బాగు చేయగలడు. విజ్ఞానం గొప్పదే కానీ అనుభవం ఇంకా ముఖ్యం.. ఎందుకంటే అనుభవాల సారమే జీవితం. జీవితాన్ని మించిన సంగీతం లేదు, ఉండదు. ఉన్నా నిష్ప్రయోజనం’ అంటూ లక్ష్మీ భూపాల్ తన ఫేస్‌బుక్ ద్వారా విమర్శకుల నోళ్లకు తాళం వేశారు.

https://www.facebook.com/lakshmi.bhupal?tn=,dC-R-R&eid=ARDK8EZ600tLiK_39GVKGS0hwdUnJORxgdTY4KT-LpBIAGL3Cc1s8RlkpTuraZTTaS43dC5ON2t_BgWg&hc_ref=ARRHR8vvd29REbgY1SQYK2JJUtEPSpJo9cuUZtNCX6_VMt8e5DgAZXfN0HWP6GyIxA4&fref=nf

Tags:    

Similar News