ఏలూరులో మహిళా కండక్టర్ కు కరోనా లక్షణాలు
దిశ, ఏలూరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా అనుమానిత కేసులు పెరగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ, తూర్పుగోదావరి, జిల్లాలో కొంత మంది కరోనా వైరస్ అనుమానంతో ఆస్పత్రుల్లో చేరారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళా కండక్టర్ కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. తెలంగాణలోని సత్తుపల్లి నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్ కు కరోనా సోకినట్టు అనుమానాలు వచ్చాయి. బస్సు ఆపి […]
దిశ, ఏలూరు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా అనుమానిత కేసులు పెరగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ, తూర్పుగోదావరి, జిల్లాలో కొంత మంది కరోనా వైరస్ అనుమానంతో ఆస్పత్రుల్లో చేరారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళా కండక్టర్ కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. తెలంగాణలోని సత్తుపల్లి నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్ కు కరోనా సోకినట్టు అనుమానాలు వచ్చాయి. బస్సు ఆపి ప్రయాణికులే ఆ మహిళా కండక్టర్ ను చింతలపుడి ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. ఇక డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ సేకరించే పనిలో ఉన్నారు. రక్త నమూనాలు ల్యాబ్ కు పంపించి వైరస్ ఉందా.. లేదా అన్నది నిర్ధారిస్తామంటున్నారు.సాధారణ జ్వరం కారణంగా ఆమె ఇబ్బంది పడుతున్నట్టు మహిళా కండక్టర్ కుటుంబీకులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా ఆర్టీసీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. అవసరమైతే తప్పా జనాలు ఎవరూ ప్రయాణాలు సాగించటం లేదు. ఎవరైనా జలుబు దగ్గు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
tags;corona virus, Eluru, west godavari, lady conductor