జీతాల్లో కోత విధించొద్దు !
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణా చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాము కూడా అత్యవసర సేవల విభాగాల పరిధిలోనే ఉన్నామని, నాలుగో తరగతి ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించొద్దని జలమండలి, జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మిక సంఘాలు వేర్వేరుగా కోరాయి. పోలీస్, వైద్య శాఖలతో పాటు తామూ ఈ విపత్కర పరిస్థితుల్లోనే పనిచేస్తున్నామని, వేతనాల్లో కోత విధిస్తే తమకు ఇబ్బంది కలుగుతుందని హైదరాబాద్ వాటర్ వర్క్స్ […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణా చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాము కూడా అత్యవసర సేవల విభాగాల పరిధిలోనే ఉన్నామని, నాలుగో తరగతి ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించొద్దని జలమండలి, జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మిక సంఘాలు వేర్వేరుగా కోరాయి. పోలీస్, వైద్య శాఖలతో పాటు తామూ ఈ విపత్కర పరిస్థితుల్లోనే పనిచేస్తున్నామని, వేతనాల్లో కోత విధిస్తే తమకు ఇబ్బంది కలుగుతుందని హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ కామ్గార్ యూనియన్ ఆధ్వర్యంలో ఎండీకి వినతిపత్రం అందించారు. బల్దియా పరిధిలోని నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించినట్టు పది శాతం కోత విధించొద్దని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కమిషనర్‌కు విన్నవించారు.
Tags: Corona, Lock down, 4th class employees, Labour unions, commissioner, GHMC