కర్నూలే నెంబర్ వన్?
కరోనా మహమ్మారి కారణంగా కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తమవుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కర్నూలు అగ్రస్ధానానికి చేరుకుంటోంది. ఏప్రిల్ ఆరంభం నుంచి రోజువారీ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కర్నూలు జిల్లా ఒకటి. ఈ కేసులు వేగం పెరగడంతో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దేశం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం కర్నూలు జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంది. కరోనా […]
కరోనా మహమ్మారి కారణంగా కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తమవుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కర్నూలు అగ్రస్ధానానికి చేరుకుంటోంది. ఏప్రిల్ ఆరంభం నుంచి రోజువారీ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కర్నూలు జిల్లా ఒకటి. ఈ కేసులు వేగం పెరగడంతో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దేశం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం కర్నూలు జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంది.
కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశంలోని 17 ప్రాంతాల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. ఆ 17 ప్రాంతాల్లో 39.9 శాతం పాజిటివ్ కేసుల నమోదుతో కర్నూలు జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో 33.1శాతంతో ఢిల్లీ. ఏపీలో గుంటూరు జిల్లా 13.8 శాతం పాజిటివ్ కేసుల నమోదుతో 16వ స్థానంలో నిలిచింది.
కాగా ఏపీలో కర్నూలు జిల్లాలో తొలిసారి థర్డ్ కాంటాక్ట్ పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడం ఆందోళన రేపింది. తాజాగా వెలుగు చూసిన కేసుల్లో ఈ థర్డ్ కాంటాక్ట్ కేసులు వెలుగు చూడడం వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన రేపుతోంది. నిన్న 26 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నంద్యాలలో 2 థర్డ్ స్టేజి పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్టు తెలుస్తోంది.
Tags: kurnool district, ap, corona virus, covid-19, incresing cases