కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర ఆత్మహత్య

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ నౌకరి.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మంచి కొలువు.. ఇంతలో ఏమైందో ఏమో.. అతను ఉసురు తీసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర (57) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పంలోని గాండ్ల వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న అతను.. వంటగదిలో ఉరి వేసుకున్నాడు. నడుమూరు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర బుధవారం డ్యూటీకి రావాల్సివున్నా హాజరు కాలేదు. దీంతో సదరు […]

Update: 2020-06-03 21:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ నౌకరి.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మంచి కొలువు.. ఇంతలో ఏమైందో ఏమో.. అతను ఉసురు తీసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర (57) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పంలోని గాండ్ల వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న అతను.. వంటగదిలో ఉరి వేసుకున్నాడు. నడుమూరు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర బుధవారం డ్యూటీకి రావాల్సివున్నా హాజరు కాలేదు. దీంతో సదరు సిబ్బంది ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటికెళ్లి చూడగా విగతా జీవిగా కనిపించాడు. కాగా, పది రోజుల క్రితమే రాజేంద్ర చిత్తూరు టూ టౌన్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ వచ్చినా.. లాక్ డౌన్ కారణంగా రిలీవ్ అవ్వలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News