అక్రమాలు బయటపెట్టినందుకే అరెస్ట్
దిశ, న్యూస్ బ్యూరో: అధికార పార్టీ నేతల అక్రమాలను బయటపెట్టినందుకే ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పాలకుల అవినీతి, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. కేటీఆర్ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేసి ఉంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెట్టి నిజాయతీ నిరూపించుకోవాలి సవాల్ విసిరారు. ప్రజల తరపున ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. […]
దిశ, న్యూస్ బ్యూరో: అధికార పార్టీ నేతల అక్రమాలను బయటపెట్టినందుకే ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పాలకుల అవినీతి, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. కేటీఆర్ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేసి ఉంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెట్టి నిజాయతీ నిరూపించుకోవాలి సవాల్ విసిరారు. ప్రజల తరపున ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజలు.. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అక్రమాలపైనా పోరాటం చేయాలని కుంతియా పిలుపునిచ్చారు.
కాగా, కాంగ్రెస్ నేత ప్రీతమ్ గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ ఆర్.సి కుంతియా, ఎంపీ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, మాజీ మంత్రి వినోద్ పాల్గొన్నారు.
Tags: khuntia, congress, press meet,Revanth reddy