డిసెంబర్ 10 తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ లను పట్టించుకునే నాధుడే ఉండడు..

దిశ, హాలియ: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా పార్టీలకు ఆతీతంగా ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్ధి డా. కుడుదుల నగేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నల్గొండ జిల్లా హాలియ పట్టణంలోని విశ్రాంత భవనం‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవ కోసం సాధించుకున్న తెలంగాణలో ఏడున్నర సంవత్సర కాలంలో స్థానిక సంస్థలలో ఏ మార్పు రాలేదన్నారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ […]

Update: 2021-12-06 07:47 GMT

దిశ, హాలియ: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా పార్టీలకు ఆతీతంగా ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్ధి డా. కుడుదుల నగేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నల్గొండ జిల్లా హాలియ పట్టణంలోని విశ్రాంత భవనం‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవ కోసం సాధించుకున్న తెలంగాణలో ఏడున్నర సంవత్సర కాలంలో స్థానిక సంస్థలలో ఏ మార్పు రాలేదన్నారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి ఒక్కపైసా విడుదల కాలేదన్నారు. ఓట్ల కోసమే కాకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ లను డిసెంబర్ 10 ఎన్నికల తర్వాత పట్టించుకునే నాధుడే ఉండడని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ల నుండి ఒక్కరికి కూడా సీటు ఇవ్వకపోవడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. తాను రాజకీయాల కోసం కాకుండా.. ప్రజా ప్రతినిధులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడటానికే ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్, నూతి రమేష్, మీసాల ఉపేందర్ ఎంపీటీసీ జిల్లా కార్యదర్శి రాజు, నరేష్, నాగరాజు, గౌస్ బాబా, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News