మాది వరద సాయం.. వారిది బురద రాజకీయం

దిశ,వెబ్ డెస్క్: ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైందని మంత్రి కేటీఆర్ అన్నారు. మానవ తప్పిదాలతోనే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తతో ఎప్పటికప్పుడు చర్యలను చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ లోని నాలాలపై ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు . క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. తక్షణ సాయంగా రూ.550 కోట్లు […]

Update: 2020-11-08 01:55 GMT

దిశ,వెబ్ డెస్క్: ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైందని మంత్రి కేటీఆర్ అన్నారు. మానవ తప్పిదాలతోనే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తతో ఎప్పటికప్పుడు చర్యలను చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ లోని నాలాలపై ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు . క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. తక్షణ సాయంగా రూ.550 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 4.30లక్షల మంది బాధితులను గుర్తించి సాయం అందజేశామని అన్నారు. 920 అధికారిక బృందాలతో ఒకే రోజు లక్ష మందికి సాయం అందించినట్టు తెలిపారు. వరద సాయంలో మేముంటే విపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వరదల్లో ప్రజలతో మేముంటే దుబ్బాకలో ఓట్ల కోసం వాళ్లు తిరిగారని అన్నారు.

Tags:    

Similar News