బీజేపీ పాలిటిక్స్‌తో జాగ్రత్త.. రైతులకు మంత్రి కేటీఆర్ కీలక సూచన

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రైతుల పోరాటంతోనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అంటూ ప్రతిపక్షాలతో పాటు రైతులు సంబురాలు చేసుకున్నారు. కానీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ రాజకీయ దుమారం రేపాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం నిరాశ చెందలేదని, “మళ్లీ ముందుకు సాగుతామని” కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నొక్కి చెప్పారు. ఇక […]

Update: 2021-12-25 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రైతుల పోరాటంతోనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అంటూ ప్రతిపక్షాలతో పాటు రైతులు సంబురాలు చేసుకున్నారు. కానీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ రాజకీయ దుమారం రేపాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం నిరాశ చెందలేదని, “మళ్లీ ముందుకు సాగుతామని” కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నొక్కి చెప్పారు.

ఇక ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో స్పందించారు. ‘ప్రధాన మంత్రి మోడీ క్షమాపణలు చెప్పడం, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం అన్నీ ఎన్నికల స్టంట్ అని నేను ఊహిస్తున్నాను?!.. ప్రధాని పారేసిన చట్టాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర రీ ప్రపోస్ చేయడం ఓ క్లాసిక్.. భారతీయ రైతులు బీజేపీ రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News