హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో లాజిస్టిక్ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో భౌగోళికంగా విస్తరణతో పాటు మౌలిక వసతులు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చాక 14 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. దేశంలో కొన్ని నగరాలకు రైళ్ల ద్వారా నీటి […]

Update: 2021-01-28 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో లాజిస్టిక్ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో భౌగోళికంగా విస్తరణతో పాటు మౌలిక వసతులు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చాక 14 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. దేశంలో కొన్ని నగరాలకు రైళ్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని గుర్తు చేశారు. కానీ, హైదరాబాద్‌లో మరో 40 ఏండ్ల వరకు నీటి సమస్య రాకుండా ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో అధికార పార్టీనేతలతో పాటు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News