ప్రజలకు దగ్గరవ్వాలి: కేటీఆర్

            మున్సిపల్‌ అధికారులు ప్రజలతో మమేకం కావాలని కేటీఆర్‌ అన్నారు. ఇవాళ మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రజల‌కు పథకాలను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పౌరసేవలు పారదర్శకంగా, అవినీతిరహితంగా.. వేగంగా అందాలన్న లక్ష్యంతో పలు విధానాలు తీసుకొస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఎలాంటి అవినీతికి చోటులేకుండా నిర్దిష్ట సమయంలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. మున్సిపల్‌ చట్టంలోని విధులనే జాబ్‌చార్ట్‌గా భావించాలని, ప్రజలతో […]

Update: 2020-02-06 05:47 GMT

మున్సిపల్‌ అధికారులు ప్రజలతో మమేకం కావాలని కేటీఆర్‌ అన్నారు. ఇవాళ మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రజల‌కు పథకాలను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పౌరసేవలు పారదర్శకంగా, అవినీతిరహితంగా.. వేగంగా అందాలన్న లక్ష్యంతో పలు విధానాలు తీసుకొస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఎలాంటి అవినీతికి చోటులేకుండా నిర్దిష్ట సమయంలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. మున్సిపల్‌ చట్టంలోని విధులనే జాబ్‌చార్ట్‌గా భావించాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగించాలని మంత్రి వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్‌లు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Tags:    

Similar News