మొక్క పెట్టు.. ఆక్సిజన్ పీల్చు.. ఏడో విడత హరితహారం

దిశ, వెబ్‌డెస్క్ : నేటి నుంచి తెలంగాణలో హరితహారం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఒక్కో ఇంటికి ఆరు మొక్కలు నాటే లక్ష్యంతో ఈ ఏడో విడత హరితహారం మొదలవుతోంది. ఇందులో భాగంగా 19.91 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల 241 నర్సరీలలో 25 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచారు. ఈసారి రహదారి వనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ, […]

Update: 2021-06-30 21:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేటి నుంచి తెలంగాణలో హరితహారం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఒక్కో ఇంటికి ఆరు మొక్కలు నాటే లక్ష్యంతో ఈ ఏడో విడత హరితహారం మొదలవుతోంది. ఇందులో భాగంగా 19.91 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల 241 నర్సరీలలో 25 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచారు. ఈసారి రహదారి వనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీ రోడ్ల వెంట మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలున్న ప్రతిచోటా మియావాకీ మోడల్‌లో మొక్కలు నాటాలని ఆదేశించింది. హైదరాబాద్‌ శివార్లలోని అంబర్‌పేట్‌ కలాన్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి ఏడో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అయితే తెలంగాణ ఏర్పాడిన 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ 2015లో హరితహారం చేపట్టారు.230 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో 220.70 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. తాజా విడతలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అంతటా ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటనున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత సైతం అధికారులు ఆయా కుటుంబాలకు అప్పగించనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News