నిరుద్యోగ భృతిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ నేతలపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో విద్యుత్ కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేకపోతే.. టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్, సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మా సహనానికి కూడా హద్దు ఉంటుందని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ రంగానికి కేసీఆర్ న్యాయం చేశారని, అసాధారణ […]

Update: 2021-01-28 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ నేతలపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో విద్యుత్ కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేకపోతే.. టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్, సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మా సహనానికి కూడా హద్దు ఉంటుందని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ రంగానికి కేసీఆర్ న్యాయం చేశారని, అసాధారణ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ త్వరలో నిరుద్యోగ భృతి కూడా ప్రకటిస్తారని వెల్లడించారు. దేశానికే తెలంగాణ ధాన్య బండాగారంగా మారిందని, ప్రభుత్వ రంగంలో లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. అంతేగాకుండా ‘‘నిన్న మొన్న వచ్చిన నేతలు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. కేసీఆరే లేకుంటే మీకు ఆ పదవులు ఎక్కడివి’’ అని పశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ, టీబీజేపీ పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడానికి అనవసర రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటు అయిందని మండిపడ్డారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తోందని అన్నారు.

Tags:    

Similar News