టీఆర్ఎస్-బీజేపీ కలిసిపోవాలి: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలని.. ప్రజల అభివృద్ధి కోసం మాత్రం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బాగ్‌లింగం‌పల్లిలోని సుందరయ్యపార్కు వద్ద నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరి వాదనలు వారికే ఉండాలన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారందరూ […]

Update: 2021-01-09 01:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలని.. ప్రజల అభివృద్ధి కోసం మాత్రం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బాగ్‌లింగం‌పల్లిలోని సుందరయ్యపార్కు వద్ద నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరి వాదనలు వారికే ఉండాలన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారందరూ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. కానీ, అనవసర రాద్ధాంతాలు ఎందుకని బీజేపీని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. టీఆర్ఎస్-బీజేపీ అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రజల కోసం అభివృద్ధి పనులు చేయాలని హితవు పలికారు. అలాగే, కంటోన్మెంట్ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కిషన్ రెడ్డి తన వంతు సాయం చేసి స్థలం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News