వారికి మంత్రి గిఫ్ట్.. మోటార్ సైకిళ్ల పంపిణీ

దిశ తెలంగాణ బ్యూరో : ఆత్మ సంతృప్తి కోసం సమాజానికి సేవ చేయాలని భావించి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం పీపుల్ ప్లాజా‌లో తన జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా డబ్బు ఖర్చు చేసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్లెక్సీలు, బ్యానర్లు‌తో పాటు వృధా ఖర్చులు చేస్తామన్నారు. అలా కాకుండా ఆత్మ […]

Update: 2021-08-08 02:20 GMT

దిశ తెలంగాణ బ్యూరో : ఆత్మ సంతృప్తి కోసం సమాజానికి సేవ చేయాలని భావించి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం పీపుల్ ప్లాజా‌లో తన జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా డబ్బు ఖర్చు చేసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్లెక్సీలు, బ్యానర్లు‌తో పాటు వృధా ఖర్చులు చేస్తామన్నారు. అలా కాకుండా ఆత్మ సంతృప్తి కోసం సమాజానికి సేవ చేయాలని భావించి గత ఏడాది జూలై 27న ఆరు అంబులెన్సులను తన సొంత ఖర్చులతో అందజేసినట్టు తెలిపారు.

ఈ ఏడాది తన జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు 100 అంబులెన్స్‌ను పంపిణీ చేస్తానని ప్రకటించానని, వారి రిక్వెస్ట్‌లతో మరో ముప్పై వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చిన పిలుపు మేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని వెయ్యి వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. వాహనం తిరగడానికి దోహదపడటం‌తో పాటు జీవనోపాధికి కూడా సహాయపడుతుందన్నారు. దివ్యాంగులు చిరునవ్వుతో బతకాలన్నది తన ఆకాంక్ష కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు చంపి పూలు రాజు, నవీన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News