ఐసీయూలో గేయ రచయిత.. ఆదుకున్న కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా కష్టకాలం లో ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, డబ్బు కోసం ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సాయం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా కష్టకాలం లో ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, డబ్బు కోసం ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ కందికొండకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన చికిత్సకు అయ్యే అన్ని ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా కందికొండ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి దైర్యం చెప్పినట్లు సమాచారం. ఇకపోతే కందికొండ గిరి తెలంగాణ బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు తెలంగాణ యాసలో రాసి మెప్పించాడు. ఇక పలు సినిమాలలోనూ కందికొండ రాసిన పాటలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.