కేటీఆర్ ఆగ్రహం.. డీజీపీకి కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో : నిరసన అనేది ప్రభుత్వాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రజాస్వామ్యంలో ఒక భాగమని, చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఇలాంటి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ సూచించారు. చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేయటం బాధ్యతారాహిత్యం అంటూ ట్వీట్‌ చేశారు. బాధ్యతారాహిత్యం : హోం మంత్రి నిరసనల పేరిట సిలిండర్, బైక్ ను చెరువులో […]

Update: 2021-07-06 12:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిరసన అనేది ప్రభుత్వాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రజాస్వామ్యంలో ఒక భాగమని, చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఇలాంటి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ సూచించారు. చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేయటం బాధ్యతారాహిత్యం అంటూ ట్వీట్‌ చేశారు.

బాధ్యతారాహిత్యం : హోం మంత్రి

నిరసనల పేరిట సిలిండర్, బైక్ ను చెరువులో వేయడం శిక్షార్హమైనవని, బాధ్యతా రాహిత్యమైనవని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్‌కు స్పందించారు. చెరువులో సిలిండర్, బైక్ వేయడం లాంటి చర్యలు ఖండించదగినవన్నారు. ఇలాంటి జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

Tags:    

Similar News