ఏపీ జలవనరుల శాఖకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ ఈఎస్‌సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. నాగార్జున సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఆ లేఖలో కోరారు. మే నెల వరకూ ఇచ్చిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకున్నారని లేఖలో ఆరోపించారు. నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం లేని […]

Update: 2020-05-19 07:02 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ ఈఎస్‌సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. నాగార్జున సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఆ లేఖలో కోరారు. మే నెల వరకూ ఇచ్చిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకున్నారని లేఖలో ఆరోపించారు. నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం లేని విధంగా, కృష్ణా రివర్ బోర్డు ఉత్తర్వులను విధిగా పాటించాలని లేఖలో ఆయన సూచించారు.

Tags:    

Similar News