అకాల వర్షం.. ధాన్యాన్ని తడిపింది.. రైతులను ఏడిపించింది..?

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను ఆగం బట్టించాయి. మండలంలోని ఎంచగూడ, మోడ్రాయిగూడెం, గుండంపల్లి, తదితర గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని గ్రామాల్లో కోతకు రెడీగా ఉన్న పంట నేలకొరిగింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగూడ మండలంలోని పలు […]

Update: 2021-11-13 08:13 GMT

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను ఆగం బట్టించాయి. మండలంలోని ఎంచగూడ, మోడ్రాయిగూడెం, గుండంపల్లి, తదితర గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని గ్రామాల్లో కోతకు రెడీగా ఉన్న పంట నేలకొరిగింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే కొత్తగూడ మండలంలోని పలు గ్రామాలలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. మరో వైపు కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలకు ఒరగడంతో కట్టింగ్ యంత్రాలు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. చేతికి అందొచ్చిన పంట ఒక్కసారిగా చేజారిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. నష్టపోయిన పంటను అధికారులు అంచనా వేసి నష్టపరిహారం ఇప్పించాలని బాధిత అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News