విక్టోరియా గ్రౌండ్‌‌కు కొత్తపేట రైతు బజారు

దిశ, రంగారెడ్డి: ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం కొత్తపేట చౌరస్తాలో ఉన్న రైతు బజార్‌‌ను తాత్కాలికంగా విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్‌కు మార్చనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, సరూర్‌‌ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌‌లు ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను సబితకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు మార్కెట్‌కు […]

Update: 2020-03-30 05:41 GMT

దిశ, రంగారెడ్డి: ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం కొత్తపేట చౌరస్తాలో ఉన్న రైతు బజార్‌‌ను తాత్కాలికంగా విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్‌కు మార్చనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, సరూర్‌‌ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌‌లు ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను సబితకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు మార్కెట్‌కు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతోనే రైతు బజార్‌ను విశాలంగా ఉన్న విక్టోరియా గ్రౌండ్‌కు తరలించనున్నామని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అనంతరం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దయాకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బేరా బాలకిషన్, సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వీఎం హోమ్ పాఠశాల సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

tags:sabitha indra reddy, kothapeta, rythu bazar, VM home ground, lb nagar, victoria ground, social distance, corona, virus,

Tags:    

Similar News