దిశ ఎఫెక్ట్ : కోరేముల సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు
దిశ, ఘట్కేసర్: గత వారం దిశ పేపర్లో కోరెముల పంచాయతీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అక్రమాలపై ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. సర్పంచ్ 14% ఫీస్ తో నిర్మాణాలకు అనుమతి నుంచి మొదలుకొని, ఏకశిలా నగర్ భూకబ్జాదారుల అక్రమ కట్టడాలకు వత్తాసు పలకడం, పంచాయతీ వార్డ్ సభ్యుల ఫిర్యాదు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి సర్పంచ్ కు నోటీసులు జారీచేశారు. తెలంగాణ పంచాయతి రాజ్ చట్టం 2018 ప్రకారం ఏడు […]
దిశ, ఘట్కేసర్: గత వారం దిశ పేపర్లో కోరెముల పంచాయతీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అక్రమాలపై ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. సర్పంచ్ 14% ఫీస్ తో నిర్మాణాలకు అనుమతి నుంచి మొదలుకొని, ఏకశిలా నగర్ భూకబ్జాదారుల అక్రమ కట్టడాలకు వత్తాసు పలకడం, పంచాయతీ వార్డ్ సభ్యుల ఫిర్యాదు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి సర్పంచ్ కు నోటీసులు జారీచేశారు. తెలంగాణ పంచాయతి రాజ్ చట్టం 2018 ప్రకారం ఏడు రోజులు లలో నోటీసుకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో చట్టం ప్రకారం సంస్థాగతపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.