స్టేడియంలో ‘సెక్స్ డాల్స్’.. చివరకేమైంది?
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా అన్ని రకాల క్రీడలు నిలిపేశారు. గత వారం రోజులుగా కొన్ని దేశాల్లో క్రీడలను తిరిగి ప్రారంభించారు. అయితే ప్రేక్షకులను మాత్రం స్టేడియంలోనికి అనుమతించట్లేదు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఆటగాళ్లకు స్పూర్తి లభించదని భావించిన ఒక ఫుట్‌బాల్ జట్టు చేసిన పనికి భారీ జరిమానా పడింది. దక్షిణ కొరియాలో కే-లీగ్ పేరుతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక మ్యాచ్‌లో ఎఫ్‌సీ సియోల్ క్లబ్ ఒక మ్యాచ్ […]
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా అన్ని రకాల క్రీడలు నిలిపేశారు. గత వారం రోజులుగా కొన్ని దేశాల్లో క్రీడలను తిరిగి ప్రారంభించారు. అయితే ప్రేక్షకులను మాత్రం స్టేడియంలోనికి అనుమతించట్లేదు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఆటగాళ్లకు స్పూర్తి లభించదని భావించిన ఒక ఫుట్‌బాల్ జట్టు చేసిన పనికి భారీ జరిమానా పడింది. దక్షిణ కొరియాలో కే-లీగ్ పేరుతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక మ్యాచ్‌లో ఎఫ్‌సీ సియోల్ క్లబ్ ఒక మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల స్థానంలో ‘సెక్స్ డాల్స్’ను ఉంచింది. బట్టల దుకాణాల్లో ఉండే మర్కండైజ్ డాల్స్ బదులు ఇలా సెక్స్ డాల్స్ ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. వాటిలో కొన్ని బొమ్మలు ‘ఎక్స్’ రేటెడ్ ఉండటంతో పిర్యాదులు అందాయి. దీంతో కే-లీగ్ సదరు జట్టుకు దాదాపు 61 లక్షల రూపాయల జరిమానా విధించింది. దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ నిషేధం అమలవుతున్న సమయంలో ఇలా బహిరంగంగా సెక్స్ డాల్స్ ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. చివరకు ఈ ఘటనపై ఎఫ్‌సీ సియోల్ క్లబ్ క్షమాపణలు చెప్పింది. సరైన సమయంలో వేరే బొమ్మలు దొరకకపోవడంతో.. అవగాహన లేని కొంత మంది సిబ్బంది ఈ బొమ్మలను తెచ్చి పెట్టారని సంజాయిషి ఇచ్చింది.