కొరియా సాకర్ స్టార్ యూ సాంగ్ మృతి

దిశ, స్పోర్ట్స్: దక్షిణ కొరియా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూ సాంగ్-చల్ (49) పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. 1994 నుంచి 2005 వరకు దక్షిణ కొరియా తరపున 124 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2002 వరల్డ్ కప్‌లో 18 గోల్స్ కొట్టి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితం అయ్యాడు. ఆనాటి వరల్డ్ కప్‌లో పోలాండ్ మీద 20 తేడాతో గెలవడంతో సౌత్ కొరియా చరిత్ర సృష్టించింది. ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా విజయం సాధించడం […]

Update: 2021-06-08 10:58 GMT

దిశ, స్పోర్ట్స్: దక్షిణ కొరియా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూ సాంగ్-చల్ (49) పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. 1994 నుంచి 2005 వరకు దక్షిణ కొరియా తరపున 124 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2002 వరల్డ్ కప్‌లో 18 గోల్స్ కొట్టి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితం అయ్యాడు. ఆనాటి వరల్డ్ కప్‌లో పోలాండ్ మీద 20 తేడాతో గెలవడంతో సౌత్ కొరియా చరిత్ర సృష్టించింది. ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా విజయం సాధించడం అదే తొలిసారి.

కాగా, వరుసగా సంచలన విజయాలు సాధిస్తూ వచ్చిన దక్షిణ కొరియా సెమీస్‌లో జర్మనీపై 1-0 తేడాతో ఓడిపోయింది. చివరకు వరల్డ్ కప్‌లో 4వ స్థానంతో సరిపెట్టుకున్నది. దక్షిణ కొరియా అక్కడి వరకు రావడానికి యూ సాంగ్ ప్రతిభే కారణం. ‘ఆ రోజు మేం విన్న అరుపులు మేం పొందిన కీర్తి మాకు జీవితాంతం గుర్తుంటుంది. నిన్ను మేము కోల్పోయాం. నీ ఆత్మకు శాంతి’ అని కొరియా ఫుట్‌బాల్ అసోసియేషన్ సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది.

Tags:    

Similar News