ఎన్నికల సంఘానికి కోమటిరెడ్డి లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనే నమ్మకం లేదని, కేంద్ర పారా మిలిటరీ బలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే కేంద్ర బలగాలను నియమించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అధికార యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేస్తోందని, బీజేపీ అభ్యర్థి బంధువుల ఇండ్లలో నోట్ల కట్టలు దొరికాయని, ఇలాంటి సంఘటనల […]

Update: 2020-10-29 11:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనే నమ్మకం లేదని, కేంద్ర పారా మిలిటరీ బలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే కేంద్ర బలగాలను నియమించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

అధికార యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేస్తోందని, బీజేపీ అభ్యర్థి బంధువుల ఇండ్లలో నోట్ల కట్టలు దొరికాయని, ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగం దుర్వినియోగమవుతోందని, టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని, వివిధ రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News