సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విరాళం

దిశ, నల్డొండ: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంపీ నిధులు రూ. 50 లక్షలను అందజేస్తున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. తెలంగాణను కరోనా కబళించే అవకాశం ఉన్నందున సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ కింద సీఎం సహాయనిధికి ప్రకటించిన 50 లక్షలతో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ప్రజలకు మాస్కులు , శానిటైజర్లను పంపిణీ చేయడానికి వాడాలని సీఎం కేసీఆర్‎ను […]

Update: 2020-03-26 11:22 GMT

దిశ, నల్డొండ: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంపీ నిధులు రూ. 50 లక్షలను అందజేస్తున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. తెలంగాణను కరోనా కబళించే అవకాశం ఉన్నందున సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ కింద సీఎం సహాయనిధికి ప్రకటించిన 50 లక్షలతో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ప్రజలకు మాస్కులు , శానిటైజర్లను పంపిణీ చేయడానికి వాడాలని సీఎం కేసీఆర్‎ను కోరారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. నిత్యావసర వస్తువుల కోసం వచ్చిన వారు ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

tag: Komatireddy Venkatreddy, Donation, CM Relief Fund

Tags:    

Similar News