ఓటమిపై కోమటిరెడ్డి స్పందన.. సోనియాను దెయ్యం అన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి స్పందించారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కోమటి రెడ్డి అనూహ్యంగా శనివారం సీఎల్పీలో వీహెచ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా సాధించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 6 వేల ఓట్లు వస్తే హుజురాబాద్‌లో కేవలం […]

Update: 2021-11-06 03:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి స్పందించారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కోమటి రెడ్డి అనూహ్యంగా శనివారం సీఎల్పీలో వీహెచ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా సాధించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 6 వేల ఓట్లు వస్తే హుజురాబాద్‌లో కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు.

పార్టీలో పెద్ద పెద్ద నాయకులున్నారని, నేను పెద్ద నాయకుడిని కాదని అందుకే హుజురాబాద్ ప్రచారానికి వెళ్లలేదని అన్నారు. పార్టీలో కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే మా నాయకులన్నారు. సోనియా గాంధీ మాకు దేవతలాంటిది.. కానీ, పార్టీలో ఉన్న కొందరు దెయ్యం అని అన్నారని పార్టీ కీలక నేతపై సెటైర్ వేశారు. పార్టీ కోసం ప్రాణమైనా ఇచ్చే నాయకుడు వీహెచ్ అని, ఆయన అంటే మొదటి నుంచి అభిమానం ఉందని పేర్కొన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉండటం మంచిది కాదని, అందరు కలిసి పని చేయాలని సూచించారు.

Tags:    

Similar News