‘ఆ యువకుడిది ఆత్మహత్య కాదు.. కేసీఆర్ సర్కార్ చేసిన హత్య’
దిశ, భువనగిరి: పట్టభద్రుడు సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ చేసిన హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కేవలం కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మాత్రమే పదవులు ఇచ్చిన కేసీఆర్.. యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత వారం కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ విషం తాగి.. చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో […]
దిశ, భువనగిరి: పట్టభద్రుడు సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ చేసిన హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కేవలం కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మాత్రమే పదవులు ఇచ్చిన కేసీఆర్.. యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత వారం కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ విషం తాగి.. చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.